మరుగుదొడ్డిలో భారీ కొండచిలువ

హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం గూడూరు శివారులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలోని మరుగుదొడ్డిలో భారీ కొండచిలువ కనిపించింది.

Update: 2025-06-12 13:30 GMT

హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం గూడూరు శివారులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలోని మరుగుదొడ్డిలో భారీ కొండచిలువ కనిపించింది.కేజీబీవీ ఎస్వో అర్చన, ఉపాధ్యాయులు పారిశుద్ధ్య సిబ్బందితో శౌచాలయాలను శుభ్రం చేయిస్తుండగా ఓ మరుగుదొడ్డిలో ఈ కొండచిలువ కనిపించింది.


సుమారు 10 అడుగుల పొడవున్న కొండచిలువను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించారు. అటవీశాఖ బీట్‌ అధికారి అశోక్, హనుమకొండలోని జూపార్కు సిబ్బంది వచ్చి కొండచిలువను పట్టుకొన్నారు. అనంతరం దానిని సమీపంలోని అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టారు.

Tags:    

Similar News