Telangana : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరిగింది.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని ప్రశ్నించింది. ఎన్నికల కమిషన్, ప్రభుత్వం చర్చించుకుని తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహించనున్నారో తెలియజేయాలని కోరింది. తదుపరి విచారణను రెండు వారాల పాటు హైకోర్టు వాయిదా వేసింది.
ఎప్పుడు జరుపుతారని...?
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని జీవో నెంబరు 9 ను విడుదల చేసింది. అయితే ఆ జీవోను హైకోర్టు కొట్టివేయడంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రావడంతో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారన్నది తెలియజేయాలని కోరింది.