Telangana : వద్దని చెప్పినా వినరే.. వాగు దాటుతూ కొట్టుకుపోయి

మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి.

Update: 2025-10-30 07:26 GMT

మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. వరదలతో నదులు ఉప్పొంగుతున్నాయి. అయితే వాగును దాటుతూ ఒక యువతి నీళ్లలో కొట్టుకుపోయింది. జనగామ జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఆ యువతి కోసం గాలింపు చర్యలు జరుపుతున్నారు. వాగులు ఉప్పొంగుతున్నాయని, ప్రయాణాలు చేయవద్దని చెప్పినా ప్రమాదకరమైన రీతిలో ప్రయాణాలు చేస్తుండటం ప్రాణాల మీదకు ముప్పు తెస్తుంది.

బైకు పై వెళుతూ...
జనగామ జిల్లాలో వరదలు విషాదం నింపాయి. జఫర్ గఢ్ మండలం శంకర్ తండా సమీపంలో బైక్ పై వెళ్తున్న యువతీయువకుడు వాగు ఉద్ధృతికి కొట్టుకుపోయారు. చెట్టుకొమ్మ సాయంతో యువకుడు శివకుమార్ బయటపడగా యువతి శ్రావ్య ఆచూకీ లభించలేదు. ఆమె కోసం ఎస్.డి.ఆర్.ఎష్ సిబ్బంది, పోలీసులు పడవల సాయంతో గాలింపు చేపట్టారు.


Tags:    

Similar News