పర్యావరణాన్ని పునరుద్ధరించాల్సిందే : సుప్రీంకోర్టు
కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది
కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కంచ గచ్చిబౌలి భూముల్లో పర్యావరణ పునరుద్ధరణపై నిన్న తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. కంచ గచ్చిబౌలి భూముల్లో పనులు చేపట్టడం లేదని సుప్రీంకోర్టుకు తెలిపింది. పర్యావరణాన్ని పునరుద్ధరిస్తున్నామని అఫిడవిట్ ను తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసింది.
తదుపరి విచారణను...
అఫిడవిట్ పరిశీలనకు సమయం అమికస్ క్యూరీ కోరింది. తదుపరి విచారణను ఈ కేసును సుప్రీంకోర్టు ఆగస్ట్ 13కు వాయిదా వేసింది. పర్యావరణాన్ని పునరుద్ధరించకపోతే అధికారులు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని మరోసారి సుప్రీంకోర్టు హెచ్చరించింది. విచారణ పూర్తయ్యేంత వరకూ కంచె గచ్చిబౌలి భూముల్లో ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని తెలిపింది.