KTR : కేటీఆర్ కు బిగ్ షాక్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపారు

Update: 2025-11-20 05:18 GMT

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఇప్పటికే అవినీతి నిరోధక శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. పలుమార్లు కేటీఆర్ ను విచారించారు. ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో 54 కోట్ల రూపాయలు చేతులు మారాయన్న ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ తో పాటు నాడు మున్సిపల్ ప్రిన్సిపల్ కార్యదర్శిగా ఉన్న అరవింందకుమార్, నాడు హెచ్ఎండీఏ అధికారి బీఎస్ఎన్ రెడ్డిని కూడా ఏసీబీ అధికారులు విచారించారు.

గవర్నర్ కు అనుమతివ్వడంతో...
అయితే ప్రజాప్రతినిధి కావడంతో కేటీఆర్ విచారణకు అనుమతివ్వాలని అవినీతి నిరోధక శాఖ గవర్నర్ ను కోరింది. నేడు గవర్నర్ కేటీఆర్ విచారణకు అనుమతివ్వడంతో కేటీఆర్ ను విచారించిన తర్వాత ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశముంది. ఫార్ములా ఈ కారు రేసులో త్వరలోనే ప్రాసిక్యూషన్ చేయనున్నారు. గవర్నర్ అనుమతి ఇవ్వలేదంటూ పలు మార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గవర్నర్ నుంచి అనుమతి రావడంతో ఏసీబీ ఛార్జిషీట్ దాఖలు చేసి న్యాయస్థానంలో విచారణ చేపట్టనుంది.


Tags:    

Similar News