Telangana : నేటితో నామినేషన్లకు తుది గడువు

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నేటితో నామినేషన్ల గడువు ముగియనుంది

Update: 2026-01-30 02:45 GMT

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నేటితో నామినేషన్ల గడువు ముగియనుంది. ఈరోజు చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలున్నాయి. ఇప్పికే అన్ని పార్టీలు తమ అభ్యర్థులను నిర్ణయించారు. వారిని నామినేషన్లు వేసుకోవాలని ఇప్పటికే పార్టీ నేతలు కోరడంతో నిన్న భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి.

రెండో రోజు...
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో రెండో రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. 7080 మంది అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు సంబంధించి 7403 నామినేషన్లు దాఖలయినట్లు అధికారులు ప్రకటించారు. నేడు ఇంకా నామినేషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న అధికారులు ఈ రోజు రేపు సాయంత్రం 5 గంటలకు నామినేషన్ దాఖలు గడువు ముగియనుందని చెప్పారు.


Tags:    

Similar News