Telangana : ఫార్ములా ఈ-రేస్ కేసులో కీలక పరిణామం
ఫార్ములా ఈ-రేస్ కేసులో ప్రభుత్వం వేగం పెంచింది
ఫార్ములా ఈ-రేస్ కేసులో ప్రభుత్వం వేగం పెంచింది. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతిని పొందిన ప్రభుత్వం ఈ కేసులో ఐఏఎస్ అరవింద్‌కుమార్‌పై విచారణకు సిద్ధమయింది. విచారణకు అనుమతి కోరుతూ డీవోపీటీకి లేఖ చీఫ్ సెక్రటరీ లేఖ రాశారు. గత ప్రభుత్వ హయాంలో అరవింద కుమార్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు.
డీవోపీటీ అనుమతి కోసం...
హెచ్ఎండీఏకు చెందిన నిధులను అరవింద్ కుమార్ విడుదల చేశారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికే అరవింద్ కుమార్ ను పలు మార్లు ఏసీబీ అధికారులు విచారించారు. దీంతో అరవింద్‌కుమార్‌పై చర్యలకు చీఫ్ సెక్రటరీ అనుమతి కోరారు. డీవోపీటీ నుంచి అనుమతి రాగానే ఏసీబీ అధికారులు ఛార్జ్‌షీట్ దాఖలు చేయనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.