Telangana : నేడు కేసీఆర్ కు మళ్లీ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు కేసీఆర్ కు నోటీసులు జారీ చేసే అవకాశముంది
ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు కేసీఆర్ కు నోటీసులు జారీ చేసే అవకాశముంది. నిన్న సిట్ అధికారులు కేసీఆర్ కు చెందని నందినగర్ నివాసంలో ఆయన పీఏకు నోటీసులు అందచేశారు. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు అందుబాటులో ఉండాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే కేసీఆర్ మాత్రం తాను ఈరోజు విచారణకు హాజరు కాలేనని తెలిపారు.
నేడు విచారణకు రాలేనని...
తాను ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే ఉంటానని, తనకు అక్కడే నోటీసులు ఇవ్వాలని, అక్కడే విచారణ చేయాలని కేసీఆర్ పోలీసు అధికారులకు లేఖ రాశారు. ఇందుకు సిట్ అధికారులు కూడా సమ్మతించారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు చివరి రోజు కావడంతో తాను ఈరోజు రాలేనని చెప్పడంతో నేడు మరొక తేదీతో కేసీఆర్ కు నోటీసులు జారీ చేసే అవకాశముంది.