నేడు స్పీకర్ దానం పిటీషన్ పై విచారణ
నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ పై స్పీకర్ గడ్డం ప్రసాదరావు విచారణ చేయనున్నారు.
నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ పై స్పీకర్ గడ్డం ప్రసాదరావు విచారణ చేయనున్నారు. ఈరోజు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను విచారణకు రావాలని నోటీసులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. అయితే ఇప్పటికే పార్టీ ఫిరాయింపులకుపాల్పడ్డానన్న పిటీషన్ ను కొట్టివేయాలంటూ దానం నాగేందర్ అఫడవిట్ దాఖలు చేశారు.
హాజరవుతారా?
అయితే నేడు దానం నాగేందర్ స్పీకర్ ఛాంబర్ లో జరిగే విచారణకు హాజరయ్యారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. దానం నాగేందర్ హాజరవుతారా? లేక న్యాయవాదులను పంపుతారా? అన్నది తేలాల్సి ఉంది. దానం నాగేందర్ మాత్రం తాను పార్టీ మారలేదని చెబుతున్నారు. తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానని చెప్పారు.