తెలంగాణలో సెలవులు పొడిగింపు?

తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగించే యోచనలో ప్రభుత్వం ఉంది

Update: 2022-01-15 02:36 GMT

తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగించే యోచనలో ప్రభుత్వం ఉంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో వ్యాప్తిని అరికట్టేందుకు ఈ చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి సూచించింది. తెలంగాణలో ప్రస్తుతం కరోనా కేసులు రోజుకు రెండువేలకు పైగానే నమోదవుతున్నాయి.

ఈ నెలాఖరు వరకూ....
మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఒమిక్రాన్ తో పాటు కరోనా కేసుల వ్యాప్తి ఎక్కువగా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో ఈ నెల 17వ తేదీ వరకూ ప్రభుత్వం విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులను ప్రకటించింది. అయితే ఈ సెలవులను ఇంకా పొడిగించాలని భావిస్తుంది. ఈ నెల 31వ తేదీ వరకూ సెలవులను పొడిగించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.


Tags:    

Similar News