ముస్లిం ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

తెలంగాణలో పనిచేస్తున్న ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2025-02-17 13:10 GMT

తెలంగాణలో పనిచేస్తున్న ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పని గంటలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రంజాన్ మాసం ప్రారంభం కానుండటంతో ప్రార్థనలు చేసుకోవడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణ పని సమయం కంటే గంట ముందుగా విధుల నుంచి వెళ్లిపోవచ్చని చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు.

రంజాన్ మాసంలో...
రంజాన్ మాసం వచ్చే నెల 2వ తేదీ నుంచి మార్చి 31 వతేదీ వరకూ రంజాన్ మాసం ఉండటంతో ఈ రోజుల్లో సాయంత్రం నాలుగు గంటలకే విధుల నుంచే ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లవచ్చని చీఫ్ సెక్రటరీ తమ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ముస్లిం సోదరులు రంజాన్ ప్రార్థనలో పాల్గొనేందుకు వీలుగా ప్రభుత్వం వారికి మాత్రమే ఈ వెసులుబాటును కల్పించింది.


Tags:    

Similar News