Telangana : తెలంగాణలో సన్నబియ్యం సూపర్ సక్సెస్ అయినట్లే.. వందశాతం హ్యాపీస్

తెలంగాణలో సన్న బియ్యానికి మంచి డిమాండ్ ఏర్పడింది. రేషన్ దుకాణాల్లో తెలుపు రంగు రేషన్ కార్డు దారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తుండటంతో ప్రజలు హ్యాపీ ఫీలవుతున్నారు.

Update: 2025-06-01 04:37 GMT

తెలంగాణలో సన్న బియ్యానికి మంచి డిమాండ్ ఏర్పడింది. రేషన్ దుకాణాల్లో తెలుపు రంగు రేషన్ కార్డు దారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తుండటంతో ప్రజలు హ్యాపీ ఫీలవుతున్నారు. ఇన్నాళ్లు దొడ్డు బియ్యం ఇవ్వడంతో వాటిని తినలేక బయట విక్రయించే వారు. కానీ ఇప్పుడు సన్న బియ్యాన్ని తమ ఇంటికే వినియోగించుకుంటున్నామని లబ్దిదారులు చెబుతున్నారు. రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం ప్రారంభమయిన నాటి నుంచి ప్రతి నెల తొలి వారం మాత్రం రేషన్ దుకాణాలకు లబ్దిదారులు పోటెత్తుతున్నారు. తమకు ప్రభుత్వం అందించే బియ్యాన్ని తీసుకుని వెళుతున్నారు. అనేక మంది ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఇన్నాళ్లకు తమ ఇళ్లలో సన్నబియ్యం వండుకుంటున్నామని చెబుతున్నారు.

ఉచితంగా సన్న బియ్యం...
తెలుపు రంగు రేషన్ కార్డులున్న వారికి సన్న బియ్యం ఇవ్వాలని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. గత నెల ఒకటోతేదీన ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ నెల మొదటి తేదీ నుంచి లబ్దిదారులు రేషన్ దుకాణాలకు క్యూకడుతున్నారు. గతంలో దొడ్డు బియ్యం ఇచ్చేటప్పుడు ఇంతటి రష్ ఉండేది కాదని రేషన్ దుకాణాల డీలర్లు చెబుతున్నారు. చాలా వరకూ బియ్యాన్ని తీసుకునే వారు కాదని, కొందరు తీసుకున్న బియ్యాన్ని బయట వ్యాపారులకు విక్రయించే వారని చెబుతున్నారు. సన్న బియ్యం కావడంతో అందులోనూ ఉచితంగా ఇవ్వడం, ఇంట్లో ఎంత మంది ఉన్నప్పటికీ ఒక్కొక్కరికీ ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తుండటంతో మంచి ఫలితం వస్తుందని చెబుతున్నారు.
ఉగాది తో ప్రారంభమయిన...
ఉగాది పండగ నాడు ప్రారంభించిన ఈ పథకం మాత్రం ఫుల్లు సక్సెస్ అయిందనే చెప్పాలి. తెలంగాణలో పండించిన సన్నబియ్యానికి ఐదు వందల రూపాయల బోనస్ చెల్లిస్తూ కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం వాటిని ప్రజలకు పంచడం అనేది మంచి కాన్సెప్ట్ గా చెబుతున్నారు. ఉచితాల్లో దీనికి మించింది లేదని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి మించి ఈ సన్నబియ్యంపథకం సక్సెస్ అయిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. వాస్తవ పరిస్థితులుకూడా అలాగే కనిపిస్తున్నాయి. ఎందుకంటే తమకు తిండికి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం నాణ్యమైన బియ్యాన్ని అందించడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తడం లేదని, తామకు ఆనందంగా ఉందని పేద వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాల్లో సన్న బియ్యం పథకం మాత్రం సూపర్ సక్సెస్ అయిందనే కామెంట్స్ బలంగా వినపడుతున్నాయి.
భారం పడుతున్నప్పటికీ...
తెలంగాణలో మొత్తం 90 లక్షలకు పైగా రేషన్ కార్డులున్నాయి. అందులో మూడుకోట్ల మందకి సన్నబియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది. ప్రతినెల రేషన్ దుకాణాలకు రెండు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తుంది. ఎక్కడా బియ్యం కొరత అంటూ లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. కొత్త రేషన్ కార్డులు వస్తే మరో ముప్ఫయి లక్షల మంది లబ్దిదారులు పెరిగే అవకాశముంటున్నారు. ఈ సన్నబియ్యం పథకం కోసం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం 10,615 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. అందులో రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలకోట్ల రూపాయలను ఖర్చుచేస్తుంది. అదనంగా ప్రభుత్వం పై మూడు కోట్ల రూపాయలు భారం పడినప్పటికీ గతంలో అరవై శాతం మంది మాత్రమే రేషన్ బియ్యం తీసుకునే వారని, ఇప్పుడు వందశాతం మంది తీసుకోవడం పథకం సూపర్ సక్సెస్ అయిందని చెప్పడానికి ఉదాహరణ అని ప్రభుత్వ వర్గాలు అందనున్నాయి.


Tags:    

Similar News