తెలంగాణ - మహారాష్ట్రల మధ్య నిలిచిన రాకపోకలు
భారీగా కురుస్తున్న వర్షాలకు గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో తెలంగాణ - మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి
భారీగా కురుస్తున్న వర్షాలకు గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. గోదావరికి వరద నీటి ప్రవాహం ఎక్కువయింది. దీంతో గోదావరి నది పరివాహకప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. నిజామాబాద్ రెంజల్ మండలంలో అంతర్రాష్ట్ర వంతెనకు ఆనుకుని గోదావరి నదిలోవరద నీరు ప్రవహిస్తుంది. వంతెనకు సమీపంలో వరద నీరు ప్రవహిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
గోదావరి నది ప్రవహిస్తుండటంతో...
దీంతో తెలంగాణ - మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిపివేసిన అధికారులు నది పరివాహక ప్రాంతాల్లోకి పశువుల కాపరులు, రైతులు అధికారులు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మహారాష్ట్ర లోని విష్ణుపురి, గైక్వాడ్, కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ గేట్లు ఎత్తి నీటి విడుదల చేస్తుండటంతో గోదావరి, మంజీర నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.