Telangana : నేడు మరోసారి యశోద ఆసుపత్రికి కేసీఆర్

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మరోసారి సోమాజీగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లనున్నారు

Update: 2025-07-10 02:23 GMT

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మరోసారి సోమాజీగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లనున్నారు. జనరల్ హెల్త్ చెకప్ కోసం కేసీఆర్ వెళ్లనున్నారు. గత వారం ఆయన ఫీవర్ తో యశోద ఆసుపత్రికి వెళ్లగా అక్కడ వైద్యులు పరీక్షలు చేసి షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయని, సోడియ స్థఆయిలు తగ్గిపోవడంతో రెండు రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందించారు.

జనరల్ హెల్త్ చెకప్ కోసం...
అనంతరం ఆయన ఆయన డిశ్చార్జ్ అయ్యారు. దీంతో వైద్యులు సూచన మేరకు ఈరోజు మరోసారి పూర్తి స్థాయిలో జనరల్ చెకప్ చేయించుకోవాలని యశోద ఆసుపత్రికి వెళ్లనున్నారు. ఈ రిపోర్టుల ఆధారంగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ఆయనకు వైద్యులు సూచనలు అందచేయనున్నారు. అయితే అభిమానులు ఎవరూ కేసీఆర్ ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేవలం జనరల్ హెల్త్ చెకప్ మాత్రమేనని కుటుంబ సభ్యులు తెలిపారు.


Tags:    

Similar News