KCR : ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రెండు రోజుల క్రితం సీజనల్ ఫీవర్ తో యశోద ఆసుపత్రిలో కేసీఆర్ అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. ఆయనకు అన్ని పరీక్షలు నిర్వహించారు. ఆయన జ్వరంతో బాధపడుతుండటంతో రెండు రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.
వైరల్ ఫీవర్ తో...
ఈ మేరకు కేసీఆర్ ను రెండు రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందించారు. సీజనల్ ఫీవర్ కంట్రోల్ కి రావడంతో పాటు సోడియం లెవెల్స్ కూడా కంట్రోల్ కి రావడంతో యశోద ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆసుపత్రి నుంచి నేరుగా నందినగర్ లోని తన నివాసానికి బయలు దేరి వెళ్లారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణితో పాటు హరీశ్ రావు, సంతోష్ రావులు కూడా పాల్గొన్నారు.