నేడు సిట్ ఎదుటకు ప్రభాకర్ రావు
ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నేడు మరోసారి స్పెషల్ ఇన్విస్టిగేషన్ అధికారుల ఎదుట హాజరు కానున్నారు
ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నేడు మరోసారి స్పెషల్ ఇన్విస్టిగేషన్ అధికారుల ఎదుట హాజరు కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కీలక నిందితుడిగా ఉన్నారు. ఇప్పటికే సిట్ అధికారులు నాలుగు సార్లు విచారణ జరిపారు. నేడు మరోసారి విచారణ జరపాలని నిర్ణయించారు. కీలకమైన వారి నుంచి లభించిన స్టేట్ మెంట్ల ఆధారంగా నేడు ప్రభాకర్ రావును విచారించనున్నారు.
సుప్రీంకోర్టుకు సిట్...
మరోవైపు నేడు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ప్రభాకర్ రావు పై సుప్రీంకోర్టుకు నేడు సిట్ అధికారులు పిటీషన్ వేయనున్నారు. ప్రభాకర్ రావుకు ఇచ్చిన వెసులుబాటును రద్దు చేయాలని కోరే అవకాశముంది. తమకు కస్టోడియల్ విచారణకు అనుమతించాలని సుప్రీంకోర్టును కోరనున్నారు. ఆగస్టు ఐదో తేదీ వరకూ వెసులు బాటు కల్పించిన నేపథ్యంలో నేడు సిట్ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు.