జూరాల డ్యామ్ గేట్లు ఎత్తివేత

జూరాల ప్రియదర్శిని డ్యామ్‌కు భారీగా వరద నీరు పోటెత్తుతుంది.దీంతో డ్యామ్ గేట్లను అధికారులు ఎత్తారు

Update: 2025-05-30 02:16 GMT

జూరాల ప్రియదర్శిని డ్యామ్‌కు భారీగా వరద నీరు పోటెత్తుతుంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు డ్యామ్ కు నీరు వచ్చిచేరుతుంది. ఎగువ నుంచి 66వేల క్యూసెక్కుల వరద నీరు రావడంతో దాంతో అధికారులు జూరాల డ్యామ్‌ పదిగేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేశారు. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా, పరిసర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.

క్రమంగా వరద ఉధృతి...
ఈ క్రమంలో కృష్ణా నదికి వరద ఉధృతి పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉప నదులకు వరద ఉధృతి పెరిగింది. ఫలితంగా వరద నీరంతా వచ్చి కృష్ణా నదిలో కలుస్తున్నది. ప్రస్తుతం 66వేల క్యూసెక్కుల వరద వస్తుండగా ఈరోజు కు వరద నీరు లక్ష క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.


Tags:    

Similar News