తుమ్మల ఆత్మీయ సమ్మేళనం నేడు.. ఎందుకో?

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. వాజేడులో ఆయన ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు

Update: 2022-11-10 04:53 GMT

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. వాజేడులో ఆయన ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. తన ముఖ్య అనుచరులతో ఆయన సమావేశం అవుతున్నారు. భద్రాచలం చేరుకుని అక్కడ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన వాజేడుకు బయలుదేరి వెళతారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల నుంచి తుమ్మల అనుచరులు హాజరవుతున్నారు. తుమ్మల అనుచరులు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినా భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది.

కీలక నిర్ణయం కోసమేనా?
తుమ్మల ఆత్మీయ సమావేశం రాజకీయంగా చర్చనీయాంశమైంది. పాలేరు నుంచి ఓటమి పాలయిన తర్వాత తనను టీఆర్ఎస్ అధినాయకత్వం పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి తుమ్మలలో ఉన్నారు. ఆయన రాజకీయంగా కీలకంగా నిర్ణయం తీసుకునే అవకాశముందని చెబుతున్నారు. టీఆర్ఎస్ లోనే కొనసాగినా తనకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ పై త్వరగా క్లారిటీ వచ్చేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. భారీగా వాహనాలతో ర్యాలీని నిర్వహిస్తూ తుమ్మల అనుచరులు వాజేడుకు చేరుకుంటున్నారు.


Tags:    

Similar News