పార్టీ జెండాను ఆవిష్కరించిన కేటీఆర్

బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు అంతా సిద్ధమయింది. ఓరుగల్లుకు జనం క్యూ కడుతున్నారు

Update: 2025-04-27 05:38 GMT

బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు అంతా సిద్ధమయింది. ఓరుగల్లుకు జనం క్యూ కడుతున్నారు. అయితే ఈరోజు ఉదయం తెలంగాణ భనవ్ లో బీఆ్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ జెండాను ఎగుర వేశారు. తర్వాత అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. తర్వాత జలదృశ్యం వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూల మాలలు వేసి చిత్రపటానికి నివాళులర్పించనున్నారు.

గులాబీమయంగా ఎల్కతుర్తి...
వరంగల్ జిల్లా ఎల్కతుర్తి అప్పుడే గులాబీ మయం అయింది. కొందరు పాదయాత్రగా ఓరుగల్లుకు వస్తుండగా, మరికొందరు ఎడ్లబండ్లపై తరలి వస్తున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ నేతలు దగ్గరుండి తమ పార్టీకి చెందిన కార్యకర్తలను ఎల్కతుర్తికి తీసుకెళ్లారు. వారికి అన్ని సదుపాయలు కల్పించి తిరిగి భద్రంగా తీసుకు వచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.


Tags:    

Similar News