Kalvakuntla Kavitha : అందుకే కవితను అరెస్ట్ చేశాం.. ఈడీ అధికారిక ప్రకటన

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు

Update: 2024-03-18 12:31 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. కోర్టు ఉత్తర్వుల మేరకే తాము కవితను అరెస్ట్ చేశామని తెలిపారు. కవతితను అరెస్ట్ చేసిన సమయంలో ఆమె బంధువులు ఆటంకం కలిగించారని కూడా పేర్కొన్నారు. కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. వందల కోట్ల ముడుపుల వ్యవహారంలో కవిత పాత్ర కీలకమని పేర్కొన్నారు.

నేతలకు ముడుపులు...
ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ముడుపులు అందించడంలో కవిత కీలక భూమిక పోషించారని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కవిత ప్రమేయం ఉందని ఈడీ అధికారులు జారీ చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటి వరకూ 240 కోట్ల సోదాలు చేశామని, ఐదు సప్లిమెంటరీ చార్జిషీట్‌లను దాఖలు చేశామన్న ఈడీ అధికారులు ఇపపటి వరకూ 128 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను సీజ్ చేశామని చెప్పారు.


Tags:    

Similar News