మాజీ మంత్రి తలసాని ఓఎస్డీని విచారించిన ఈడీ అధికారులు
గొర్రెల పంపిణీ కుంభకోణంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ ఓఎస్డీ కల్యాణ్ ను అదుపులోకి తీసుకున్నారు.
గొర్రెల పంపిణీ కుంభకోణంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ ఓఎస్డీ కల్యాణ్ ను అదుపులోకి తీసుకున్నారు. గొర్రెల పంపిణీ కుంభకోణంలో ఏడు వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని అనుమానించిన ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసుతో ఈడీ అధికారులు కూడా రంగంలోకి దిగారు.
పలు కీలక ఫైళ్ల స్వాధీనం...
ఈ గొర్రెల పంపిణీ స్కీంలో స్కామ్ జరిగిందని భావించి హైదరాబాద్, తెలంగాణలోని పలు చోట్ల సోదాలు నిర్వహించిన ఈడీ అధికారుల కల్యాణ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దాదాపు ఏడు గంటల సేపు విచారించిన అధికారులు కల్యాణ్ నుంచి పలు డాక్యుమెంట్లు, కీలక మైన ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. కొంత నగదును కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.