కాంగ్రెస్ దూకుడు.. టికెట్ ఆశించేవారు ఆ రోజు నుంచి అప్లై చేసుకోండి..!

రేవంత్ రెడ్డి అధ్యక్షతన గాంధీ భవ‌న్‌లో ఎన్నికల కమిటీ సమావేశం జ‌రిగింది.

Update: 2023-08-15 03:27 GMT

రేవంత్ రెడ్డి అధ్యక్షతన గాంధీ భవ‌న్‌లో ఎన్నికల కమిటీ సమావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో ఎన్నికల వ్యూహం, అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగిందని.. స్క్రీనింగ్ కమిటి మురళి ధరన్, బాబా సిద్ధికి, జీగ్నేష్ మేవాని హాజరయ్యారని వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి విదివిధానాలు, రుసుముపై సబ్ కమిటీ ఏర్పాటు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. సబ్ కమిటి చైర్మన్ గా దామోదర్ రాజానర్సింహా, సభ్యులుగా రోహిత్ చౌదరి, మహేష్ గౌడ్ నియ‌మించార‌ని.. 17వ తేదీ వరకు విదివిధానాలు ఖరారు అవుతాయ‌ని పేర్కొన్నారు.

18వ‌ తేదీ నుండి 25వ తేదీ వరకు డీడీ రూపంలో రుసుము చెల్లించి.. అప్లికేషన్ ఇవ్వాలని వివ‌రించారు. టికెట్ ఆశించేవారు గాంధీ భవన్ లో అప్లై చేసుకోవాలని సూచించారు. సెప్టెంబర్ మొదటి వారంలో మరోసారి ఎన్నికల కమిటి సమావేశం అవుతుంద‌ని తెలిపారు. అప్లికేషన్లు పరిశీలించి పీఈసీ లో సమర్పిస్తాం. వాటిని స్క్రినింగ్ కమిటీకి పంపిస్తామ‌ని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ టికెట్ ఇవ్వడం కుదరదని స్ప‌ష్ట‌త ఇచ్చారు. పూర్తి స్థాయిలో సర్వేలు ఆధారం కాదని.. కానీ సర్వేలు కూడా పరిగణలోకి తీసుకుంటామ‌న్నారు. అభ్యర్థుల ఎంపికలో ప్రధాన భూమిక పీఈసీ దేన‌న్నారు. సరైన అభ్యర్థి ని నిర్ణయించేది పీఈసీ, స్క్రినింగ్ కమిటి, ఆ తరువాత సీఈసీ, తరువాత సీడబ్ల్యూసీ అని వివ‌రించారు. సెప్టెంబర్‌లో అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలిపారు.


Tags:    

Similar News