నేటితో ఎన్నికల ప్రచారానికి ముగింపు

ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నేటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది

Update: 2025-02-25 01:57 GMT

ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నేటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నెల 27వ తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో గ్రాడ్యుయేట్, ఎమ్మెల్సీ ఎన్నికలు జరగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ అన్ని పార్టీలూ ముమ్మరంగా ప్రచారం చేశాయి. ఆంధ్రప్రదేశ్ లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 27వ తేదీన పోలింగ్ జరగనుంది.

ఎమ్మెల్సీ స్థానాల కోసం...
తెలంగాణాలోనూ మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. బీఆర్ఎస్ ఇక్కడ తమ అభ్యర్థులను బరిలోకి దించలేదు. పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్యనే ఉంది. ఎమ్మెల్సీ స్థానాల కోసం నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కరోజులోనే మూడు జిల్లాల్లో పర్యటించి ప్రచారాన్ని నిర్వహించి వచ్చారు. ఈరోజు సాయంత్రం ఐదు గంటలతో ప్రచారానికి తెరపడనుంది.


Tags:    

Similar News