నేటి నుంచి తెలంగాణలో డిజిటల్ క్లాసులు

హై కోర్టు కూడా విద్యార్థులకు ఆఫ్ లైన్ తరగతులతో పాటు.. ఆన్ లైన్ తరగతులను కూడా అందుబాటులో ఉంచాలని హైకోర్టు ఆదేశించింది.

Update: 2022-02-04 05:38 GMT

తెలంగాణ వ్యాప్తిగా నేటి నుంచి డిజిటల్ క్లాసులు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు గురువారమే ఉత్తర్వులు జారీ చేశారు. టీ - శాట్ ద్వారా ఈనెల 8వ తేదీ వరకూ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డిజిటల్ తరగతులు ప్రసారమవుతాయని అధికారులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాటన్నింటినీ విద్యాశాఖ పూర్తి చేసింది.

రాష్ట్రంలో కోవిడ్ తీవ్రత దృష్ట్యా సంక్రాంతి సెలవులను జనవరి 31వరకూ పొడిగించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు రీ ఓపెన్ అయినప్పటికీ.. కోవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా తగ్గింది. మరోవైపు హై కోర్టు కూడా విద్యార్థులకు ఆఫ్ లైన్ తరగతులతో పాటు.. ఆన్ లైన్ తరగతులను కూడా అందుబాటులో ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ డిజిటల్ క్లాసులను అందుబాటులోకి తీసుకొచ్చింది.


Tags:    

Similar News