నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు.. చైనా మద్దతు లేదంటూ?
సీపీఐ నారాయణ ఇటీవల పాక్ - భారత్ సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్తతలపై చేసిన కామెంట్స్ పై వివరణ ఇచ్చారు.
సీపీఐ నారాయణ ఇటీవల పాక్ - భారత్ సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్తతలపై చేసిన కామెంట్స్ పై వివరణ ఇచ్చారు. తాను అన్న మాటలను కొందరు వక్రీకరించారని చెప్పారు. తాను అన్నది వేరు... మీడియాలో వచ్చింది వేరు అని నారాయణ అన్నారు. పాకిస్థాన్ కు చైనా సహాయం చేస్తుందనేది కేవలం అపోహ మాత్రమేనని నారాయణ అన్నారు.
తన వ్యాఖ్యలను...
గతంలో మాట్లాడిన తన వ్యాఖ్యలను అపార్ధం ళచేసుకొని తనను పాకిస్థాన్ ఏజెంట్ అని కొందరు అంటున్నారని నారాయణ అన్నారు. భార్య కళ్ల ముందే కాల్లపారాణి ఆరకముందే కట్టుకున్న భర్తలను చంపిన ఉగ్రవాదులపై ఇండియన్ ఆర్మి ధాడులు చేయడాన్ని తాను తప్పు పట్టలేదని, సామాన్య ప్రజలపై దాడులు చేయడాన్నిమాత్రమే తాను తప్పుపట్టానని నారాయణ వివరించారు.