తెలంగాణలో తగ్గిన కరోనా
తెలంగాణలో కరోనా కేసులు బాగా తగ్గాయి. ఒక్కరోజులో 175 కేసులు నమోదయ్యాయి
తెలంగాణలో కరోనా కేసులు బాగా తగ్గాయి. ఒక్కరోజులో 175 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఎలాంటి మరణాలు సంభవించలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. 252 మంది ఒక్కరోజులో కోలుకున్నారని తెలిపారు. రికవరీ రేటు 99.92 శాతంగా నమోదయింది. హైదరాబాద్ లో అత్యధికంగా 98 కరోనా కేసులు నమోదయినట్లు అధికారులు వెల్లడించారు.
అజాగ్రత్త వద్దు...
తెలంగాణలో ఇప్పటి వరకూ 8,33,951 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 8,27,763 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. 4,111 మంది కరోనా కారణంగా మరణించారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 2,077 యాక్టివ్ కేసులున్నాయని వెల్లడించారు. కరోనా కేసులు తగ్గాయని అజాగ్రత్తగా ఉండవద్దని, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి చేయాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.