వచ్చే నెల 18న విచారణకు వాయిదా

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటు పై విచారణ ముగిసింది

Update: 2026-01-30 07:13 GMT

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటు పై విచారణ ముగిసింది. బీఆర్ఎస్ తన వాదనలు వినిపించింది. నాగేందర్ తన వాదనలను వినిపించారు. తనను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని, తాను ఇంకా బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానని దానం నాగేందర్ తరుపున న్యాయవాదులు తెలిపారు. అయితే సికింద్రాబాద్ పార్లమెంటుకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విషయాన్ని బీఆర్ఎస్ నేతలు స్పీకర్ దృష్టికి తెచ్చారు.

దానం నాగేందర్ పై బీజేపీ...
అయితే మరొకవైపు బీజేపీ కూడా తమ పిటీషన్ ను విచారించాలని కోరింది. అయితే మున్సిపల్ ఎన్నికలున్నందున అవి పూర్తయిన తర్వాత తమను విచారించాలని స్పీకర్ గడ్డం ప్రసాదరావును కోరింది. దీంతో గడ్డం ప్రసాదరావు దానం నాగేందర్ అనర్హత వేటు పిటీషన్ పై ఫిబ్రవరి 18న విచారణ చేస్తానని తెలిపారు. దీంతో విచారణ వచ్చే నెలకు వాయిదా పడింది.


Tags:    

Similar News