తెలంగాణలో తగ్గిన కరోనా
తెలంగాణలో కరోనా కేసులు తగ్గాయి. ఒక్కరోజులోనే 265 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు
తెలంగాణలో కరోనా కేసులు తగ్గాయి. ఒక్కరోజులోనే 265 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. అయితే ఎటువంటి మరణాలు సంభవించలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 528 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రోజువారీన పాజిటివిటీ రేటు 0.49 శాతంగా నమోదయింది. అలాగే రికవరీ రేటు 99.13 శాతంగా ఉందని అధికారులు చెప్పారు.
యాక్టివ్ కేసులు...
తెలంగాణలో ఇప్పటి వరకూ 8,29,467 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 8,22,173 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 4,111 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 3,183 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నమోదయిన కేసుల్లో 142 కేసులు ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఉండటం విశేషం.