తెలంగాణలో తగ్గని కరోనా

తెలంగాణలో కరోనా కేసులు తగ్గడం లేదు. రోజుకు ఆరు వందల కేసుల వరకూ నమోదవుతున్నాయి. ఒక్కరోజులోనే 605 కేసులు నమోదయ్యాయి

Update: 2022-08-11 02:29 GMT

తెలంగాణలో కరోనా కేసులు తగ్గడం లేదు. రోజుకు ఆరు వందల కేసుల వరకూ నమోదవుతున్నాయి. ఒక్కరోజులోనే 605 కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా కారణంగా ఎవరూ మరణించకపోవడం కొంత ఊరట కల్గించే అంశం. నిన్న ఒక్కరోజులోనే 992 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. రికవరీ రేటు 98.93 శాతంగా నమోదయింది. యాక్టివ్ కేసుల శాతం 0.49 శాతంగా ఉందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో 231 కరనా కేసులు నమోదయ్యాయి.

యాక్టివ్ కేసులు...
తెలంగాణలో ఇప్పటి వరకూ 8,27,383 మంది కరోనా బారిన పడినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వీరిలో 8,18,552 మంది కోలుకున్నారని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా కారణంగా 4,111 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 4,720 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో భౌతిక దూరం, మాస్క్ లను ధరించడం విధిగా పాటించాలని అధికారులు ప్రజలకు సూచనలు చేస్తున్నారు.


Tags:    

Similar News