తెలంగాణలో తగ్గుతున్న కేసులు
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఒక్కరోజులోనే 290 కరోనా కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఒక్కరోజులోనే 290 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న 450 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. నమోదయిన కేసుల్లో హైదరాబాద్ లోనే ఎక్కువ. 115 మంది హైదరాబాద్ లోనే కరోనా బారిన పడ్డారు. మరణాలు లేకపోవడం ఊరట కల్గించే అంశం. 99 శాతం మంది హోం ఐసొలేషన్ లోనే చికిత్స పొంది కోలుకుంటున్నారు. హైదరాబాద్ లో కోవిడ్ నిబంధనలను పాటించకపోవడంతోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
కోవిడ్ నిబంధనలను....
ఇప్పటి వరకూ తెలంగాణలో 8,33,521 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 8,27154 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 4,111 మంది మరణించారు. ప్రస్తుతం రికవరీ రేటు 99.24 శాతంగా నమోదయింది. ఈరోజు వరకూ తెలంగాణలో 2,256 యాక్టివ్ కేసులున్నాయని అధికారులు తెలిపారు.