తెలంగాణలో కొనసాగుతున్న కరోనా

తెలంగాణాలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒక్కరోజులోనే 494 కరోనా కేసులు నమోదయ్యాయి. మరణాలేవీ సంభవించలేదు.

Update: 2022-08-10 02:48 GMT

తెలంగాణాలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒక్కరోజులోనే 494 కరోనా కేసులు నమోదయ్యాయి. మరణాలేవీ సంభవించలేదు. ఒక్కరోజులో కరోనా నుంచి 1,064 మంది కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రికవరీ రేటు ప్రస్తుతం 98.89 శాతంగా నమోదయింది. తెలంగాణలో కేసులు పెరుగుతున్నాయని, ప్రజలు కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని అధికారులు కోరుతున్నారు. అంతే కాకుండా వైరస్ ప్రమాదకారి అని కాదు అని భావించవద్దని, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, అనారోగ్యంతో ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

హైదరాబాద్ లో...
తెలంగాణలో ఇప్పటి వరకూ 8,26,778 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 8,17,560 మంది కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 4,111 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 5,107 యాక్టివ్ కేసులున్నాయి. కేసులు నమోదయిన 494 కేసులో 221 కేసులు హైదరాబాద్ లో నమోదయినవే. ఎక్కువ సంఖ్యలో నగరంలో కరోనా బారిన పడుతున్నారని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News