తెలంగాణలో కొనసాగుతున్న కరోనా
తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒక్కరోజులోనే 338 కరోనా కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒక్కరోజులోనే 338 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. నిన్న ఒక్క రోజే 507 మంది కరోనా నుంచికోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఎక్కువగా 135 కేసులు హైదరాబాద్ లోనే నమోదయ్యాయి. రికవరీ రేటు శాతం 99.20 శాతంగా ఉందని అధికారులు తెలిపారు.
అప్రమత్తంగా ఉండాలంటూ...
తెలంగాణలో ఇప్పటి వరకూ 8,32,933 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 8,26,269 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా కారణంగా 4,111 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 2,553 యాక్టివ్ కేసులున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.