తగ్గుతున్న యాక్టివ్ కేసులు

తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒక్కరోజులోనే 192 కరోనా కేసులు నమోదయ్యాయి

Update: 2022-08-30 04:00 GMT

తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒక్కరోజులోనే 192 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. ఒక్కరోజులోనే 345 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. కరోనా రికవరీ రేటు 99.29 శాతంగా నమోదయింది.

హైదరాబాద్ లోనే...
తెలంగాణలో ఇప్పటి వరకూ 8,34,143 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 8,28,108 కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ తెలంగాణలో 4,111 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 1,924 యాక్టివ్ కేసులున్నాయి. హైదరాబాద్ లో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. 80 మందికి హైదరాబాద్ నగరంలో కరోనా సోకిందని వైద్యాధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News