తెలంగాణలో స్థిరంగా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.

Update: 2022-08-07 02:52 GMT

తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్నటి తో పోలిస్తే కొంత కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా పూర్తి స్థాయిలో కరోనా తగ్గలేదు. ఒక్కరోజులో 652 కరోనా కేసులు నమోదయ్యాయి. ఎలాంటి మరణాలు సంభవించలేదు. వీటిలో హైదరాబాద్ లోనే కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. హైదరాబాద్ లో 220 కేసులు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణకు ప్రత్యేకంగా అలర్ట్ జారీ చేసింది.

యాక్టివ్ కేసులు...
తెలంగాణలో ఇప్పటి వరకూ 8,25,360 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 8,15,030 మంది కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.74 శాతంగా ఉందని తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకూ కరోనా కారణంగా 4,111 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 6,219 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ నిబంధనలను పాటించాలని సూచిస్తున్నారు.


Tags:    

Similar News