హైదరాబాద్ లోనే ఎక్కువ కేసులు

తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఎక్కువగా హైదరాబాద్ లోనే కేసులు నమోదవుతున్నాయి.

Update: 2022-08-08 07:38 GMT

తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రజలు పూర్తిగా కోవిడ్ నిబంధనలను పక్కన పెట్టడంతో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఒక్కరోజులోనే 984 కరోనా కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య నమోదు కాకపోవడం కొంత ఊరటనిచ్చే అంశమే కాని కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. నిన్న ఒక్కరోజులోనే 923 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఎక్కువగా హైదరాబాద్ లోనే కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజులోనే 365 కరోనా కేసులు నమోదయినట్లు అధికారులు వెల్లడించారు.

పాజిటివిటీ రేటు...
తెలంగాణలో ఇప్పటి వరకూ 8,24,708 మంది కరోనా వైరస్ బారిన పడినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. వీరిలో 8,14,179 మంది కరోనా నుంచి కోలుకున్నారని తెలిపారు. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా కారణంగా 4,111 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 6,418 యాక్టివ్ కేసులున్నాయని వైద్య శాఖ అధికారులు తెలిపారు. కోలుకునే వారి శాతం 98.72 శాతంగా నమోదవుతుంది. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే కేసుల సంఖ్య మరింత ఎక్కువవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Tags:    

Similar News