బాసర ట్రిపుల్ ఐటీలో కరోనా కలకలం
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ లో కరోనా కలకలం రేగింది
corona virus continue to be registered in india
తెలంగాణలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుుతన్న సమయంలో అన్ని రాష్ట్రాలూ అప్రమత్తమయ్యాయి. తాజాగా నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ లో కరోనా కలకలం రేగింది. కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో లెక్చరర్ కుటుంబానికి ముగ్గురికి కరోనా వచ్చినట్లు ట్రిపుల్ ఐటీ అధికారులు వెల్లడించారు. దీంతో వారినిస్థానిక కళాశాలలోని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నామని వీసీ వెంకటరమణ తెలిపారు.
లెక్చరర్ కుటుంబానికి...
గత వారం రోజులుగా లెక్చరర్ తో సమావేశమైన వారికి వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఎక్కువ కేసులు నమోదవుతుండటంతో కళాశాల యాజమాన్యం అప్రమత్తమయింది. తెలంగాణలోనూ కరోనా కేసుల సంఖ్య ఎక్కువయ్యే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ నిబంధనలు విధిగా అందరూ పాటించాలని చెబుతున్నారు.