తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. నిన్నటి వరకూ ఆరు వందలకు పైగా నమోదయిన కేసులు ప్రస్తుతం కొంత తగ్గాయి

Update: 2022-08-13 02:33 GMT

తెలంగాణలో కరోనా కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. నిన్నటి వరకూ ఆరు వందలకు పైగా నమోదయిన కేసులు ప్రస్తుతం కొంత తగ్గాయి. ఒక్కరోజులో 476 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 30,205 మందికి పరీక్షలు చేయగా 476 మందికి కరోనా వైరస్ సోకిదంది. మరణాలు ఏమీ సంభవించలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. వీటిలో ఎక్కువగా హైదరాబాద్ లోనే ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ లో 239 కరోనా కేసులు నమోదయ్యాయి.

హైదరాబాద్ లోనే.....
తెలంగాణలో ఇప్పటి వరకూ 8,28,471 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వీరిలో 8,20,597 మంది కరోనాకు చికిత్స పొంది కోలుకున్నారు. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 4,111 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 3,763 యాక్టివ్ కేసులున్నాయి. కేసులు తగ్గాయని ప్రజలు అజాగ్రత్తగా ఉండవద్దని, కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.


Tags:    

Similar News