Telangana Corona : తెలంగాణలో తగ్గుతున్న కరోనా

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా 311 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు.

Update: 2022-02-25 01:10 GMT

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా 311 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు. తెలంగాణలో ఇప్పటి వరకూ 7,88,096 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 7,79,893 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

రికవరీ రేటు...
ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4,092 ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ 4,111 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో రికవరీ రేటు 98.76 శాతంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. ఈ కేసుల్లో ఒక్క హైదరాబాద్ లోనే 90 కేసులు నమోదయ్యాయి.


Tags:    

Similar News