తెలంగాణ కరోనా అప్ డేట్
తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా 67కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు.
హైదరాబాద్ : తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా 67కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. తెలంగాణలో ఇప్పటి వరకూ 7,90,292 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 7,87,022 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
యాక్టివ్ కేసులు...
ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 865 ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ 4,111 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో రికవరీ రేటు 99.81 శాతంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు.