తెలంగాణలో కరోనా అప్‌డేట్

తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా 49 కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు

Update: 2022-03-26 01:32 GMT

హైదరాబాద్ : తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా 49 కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. తెలంగాణలో ఇప్పటి వరకూ 7,90,714 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 7,89,373 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

రికవరీ రేటు...
ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 619 ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ 4,111 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో రికవరీ రేటు 98.91 శాతంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు.


Tags:    

Similar News