తెలంగాణలో కరోనా అప్‌డేట్

తెలంగాణలో కరోనా కేసులు తగ్గడం లేదు. ప్రతి రోజు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

Update: 2022-08-06 03:26 GMT

తెలంగాణలో కరోనా కేసులు తగ్గడం లేదు. ప్రతి రోజు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఒక్కరోజులోనే తెలంగాణలో 984 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఎటువంటి మరణం సంభవించలేదు. కేసుల సంఖ్య పెరుగుతున్నా ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య మాత్రం పెద్దగా లేదు. హోంఐసొలేషన్ లోనే ఉండి చికిత్స పొందుతూ కోలుకుంటుండటంతో పెద్దగా ఎవరూ లెక్క చేయడం లేదు. దీంతో ప్రజలు కూడా కోవిడ్ నిబంధనలను పాటించడం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అప్రమత్తంగా లేకపోతే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు.

యాక్టివ్ కేసులు....
ఇప్పటి వరకూ తెలంగాణలో 8,24,706 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 8,14,179 మంది కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా కారణంగా 4,111 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 6,418 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. కోలుకునే వారి శాతం 98.72 శాతంగా నమోదయింది. హైదరాబాద్ లో అత్యధికంగా 365 కరోనా కేసులు నమోదయ్యాయి.


Tags:    

Similar News