కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్నటి ఎన్నికల్లో తనను ఎల్.బి.నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం కోరిందని, అప్పుడు మంత్రి పదవి ఇస్తానని చెప్పిందని అన్నారు. కానీ తనకు మునుగోడు ప్రజలు ముఖ్యమని తాను ఆనాడు ఎల్బీనగర్ లో పోటీకి సుముఖత చూపలేదని అన్నారు.
మునుగోడు ప్రజలే ముఖ్యమని...
తనకు మునుగోడు ప్రజలే ముఖ్యమన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి రాకపోయినా పరవాలేదన్నారు. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కు కమ్మునిస్టులు మద్దతు ఇవ్వబట్టే తాను నాడు బీజేపీ నుంచి పోటీ చేసి మునుగోడులో ఓడిపోయానని తెలిపారు. వామపక్షాలు మద్దతు ఇవ్వకపోతే తానే నాడు కూడా మునుగోడు నుంచి గెలిచేవాడినని చెప్పారు.