థాక్రే లైట్ తీసుకున్నారు : కోమటిరెడ్డి

కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు థాక్రేతో సమావేశమయ్యారు.

Update: 2023-02-15 07:00 GMT

కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు థాక్రేతో సమావేశమయ్యారు. దాదాపు గంటకు పైగా ఆయన సమావేశమయి పార్టీ పరిస్థతిపై చర్చించారు. నిన్నటి వ్యాఖ్యలపై తమ మధ్య ఎలాంటి చర్చ జరగలేదన్నారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకూడదని చెప్పానని తెలిపారు. తాను నిన్న తప్పు ఏమీ మాట్లాడలేదని, కాంగ్రెస్ పార్టీ వాళ్లు కూడా నిన్న తాను మాట్లాడిన పూర్తిస్థాయి వీడియోను చూడలేదన్నారు.

పొత్తు వద్దని చెప్పా...
థాక్రే కూడా నిన్న నేను చేసిన వ్యాఖ్యలను లైట్ గా తీసుకున్నారన్నారు. తాను ఎక్కడా తప్పు మాట్లాడలేదని, అధినాయకత్వం అభిప్రాయం కూడా అదేనని అన్నారు. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని నష్టపోయానని థాక్రేతో చెప్పానని అన్నారు. ముందుగానే టిక్కెట్లు ఖరారు చేయానని, ఐదు నెలలకు ముందుగానే టిక్కెట్లు ఖరారు చేస్తే ప్రజల్లోకి అభ్యర్థులు వెళ్లేందుకు సులువుగా ఉంటుందని తన అభిప్రాయంగా వారికి చెప్పానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలనే అంశంపైనే తాము చర్చించామని చెప్పారు.


Tags:    

Similar News