అమెరికా నుండి వచ్చి ఓటు ట్విస్ట్ సూపర్!!

సినిమాల్లో మనం చూసే ఉంటాం. ఒక్క ఓటు క్లైమాక్స్ లో హీరోను గెలిచేలా చేయడం.

Update: 2025-12-15 10:24 GMT

సినిమాల్లో మనం చూసే ఉంటాం. ఒక్క ఓటు క్లైమాక్స్ లో హీరోను గెలిచేలా చేయడం. అచ్చం అలాంటి ఘటనే చోటు చేసుకుంది. అది కూడా అమెరికా నుండి వచ్చి పంచాయతీ ఎన్నికల్లో వేసిన ఓటు సూపర్ ట్విస్ట్ ఇచ్చింది. నిర్మల్‌ జిల్లా లోకేశ్వరం మండలంలోని బాగాపూర్‌ పంచాయతీలో ముత్యాల శ్రీవేద పోటీలో నిలిచింది. ఆమె మామ ముత్యాల ఇంద్రకరణ్‌రెడ్డి అమెరికా నుంచి వచ్చి మరీ ఓటు వేశారు. అనూహ్యంగా ఆమె ఒకే ఒక్క ఓటుతో గెలిచింది. ఈ ఎన్నికల్లో మొత్తం 426 ఓట్లకు 378 పోలయ్యాయి. ఇందులో ముత్యాల శ్రీవేదకు 189, మరో అభ్యర్థికి హర్షస్వాతికి 188 ఓట్లు రాగా ఒక ఓటు చెల్లలేదు. దీంతో శ్రీవేద ఒక్క ఓటు తేడాతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. ఇంద్రకరణ్‌రెడ్డి రెండు నెలల కిందట అమెరికాలోని తన కుమార్తె వద్దకు వెళ్లారు. పంచాయతీ ఎన్నికల్లో తన కోడలు నిల్చుందని తెలుసుకున్న ఆయన పోలింగ్‌కు 4 రోజుల కిందట హుటాహుటిన అమెరికా నుంచి వచ్చారు.

Tags:    

Similar News