Revanth Reddy : నేడు కూడా ఢిల్లీలో రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. నేడు పలువురు పార్టీ పెద్దలతో పాటు కేంద్ర మంత్రులను కలిసే అవకాశముంది. ఉదయం పదకొండు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంటుకు వెళ్లనున్నారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున పార్టీనేతలు, కేంద్ర మంత్రులందరూ అక్కడే ఉండనున్నారు.
పార్లమెంటుకు వెళ్లి...
పార్టీ పెద్దలను కలసి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాలను గురించి వివరించనున్నారు. అలాగే ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్ తో పాటు పలు అంశాలను రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలతో మాట్లాడే అవకాశముంది. రాజకీయ పరిణామాలపై చర్చించే ఛాన్స్ ఉంది. దీంతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులను గురించి చర్చించనున్నారు.