Telangana : రెండో దశలోనూ కాంగ్రెస్ దే హవా

తెలంగాణలో స్థానిక సంస్థల రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ విజయ పరంపరను కొనసాగిస్తుంది

Update: 2025-12-14 13:02 GMT

తెలంగాణలో స్థానిక సంస్థల రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ విజయ పరంపరను కొనసాగిస్తుంది. కాంగ్రెస్ తొలిదశలో చూపించిన తరహాలోనే రెండో దశలోనూ ఎక్కువ స్థానాలను గెలుచుకునే దిశగా పయనిస్తుంది. సర్పంచ్ పదవులకు, వార్డు సభ్యులకు పార్టీ గుర్తులు లేకపోయినప్పటికీ ఖచ్చితంగా గ్రామాల్లో అన్ని పార్టీల నేతలు పోటీ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇలా తమ పార్టీ బలపర్చిన అభ్యర్థులమంటూ ప్రచారం చేసుకున్నారు. అందులో కొందరు స్వతంత్ర సభ్యులు కూఉన్నారు. అయితే రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ మంది కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులే గెలుస్తుున్నారు.

అధిక స్థానాల్లో...
కాంగ్రెస్ తన ప్రభావాన్ని మరింత బలపరుస్తూ, గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో దశలో కూడా విజయ పరంపరను కొనసాగించింది. 193 మండలాల్లోని 3,911 సర్పంచ్ మరియు 29,917 వార్డు సభ్యుల స్థానాలకు ఆదివారం ఉదయం జరిగిన పోలింగ్ మధ్యాహ్నం 1 గంటలకు ముగిసింది. గంట తర్వాత లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల నాటికి కాంగ్రెస్ మద్దతు అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యం సాధిస్తూ, ఈ దశలోనే కాంగ్రెస్ బలపర్చిన 600కు పైగా సర్పంచ్ పదవులను గెలుచుకున్నారు.
స్పష్టమైన ఆధిక్యతను...
ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం, గ్రామీణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న సంస్థాగత బలాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. భారత్ రాష్ట్ర సమితి మద్దతు అభ్యర్థులు 200కు పైగా సర్పంచ్ స్థానాలను గెలుచుకోగా, బీజేపీ మద్దతు అభ్యర్థులు సుమారు 70 స్థానాలను దక్కించుకున్నారు. ఇతర రాజకీయ పార్టీలు మరియు స్వతంత్ర అభ్యర్థులు కలిపి 200కు పైగా సర్పంచ్ స్థానాలను గెలుచుకున్నప్పటికీ, కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఆధిపత్యాన్ని చాటింది. ఇంకా కొన్ని స్థానాల్లో కౌంటింగ్ జరుగుతోంది.
Tags:    

Similar News