Weather Report : ఇదేందరా అయ్యా.. ఈ చలి.. పదేళ్లలో ఎప్పుడూ చూడలేదుగా?

మరో మూడు రోజుల పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు

Update: 2025-12-15 04:08 GMT

దేశమంతా చలికి వణుకుతుంది. అక్కడా ఇక్కడా కాదు... అన్ని ప్రాంతాల్లో చలితీవ్రత ఈసారి ఎక్కువగానే ఉంది. ఇటీవల భారీ వర్షాలు.. అంతకు ముందు గరిష్ట ఉష్ణోగ్రతలు దేశమంతటా నమోదయినట్లుగానే ఈసారి చలితీవ్రత అతి తక్కువ స్థాయిలో నమోదవుతుంది. ఇంత చలి గత దశాబ్దకాలంలో ఎన్నడూ చూడలేదు. చలి తీవ్రత కూడా రికార్డులు బ్రేక్ చేస్తుందంటుున్నారు. ఇంకా మరో మూడు రోజుల పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే జనవరి రెండో వారం వరకూ అక్కడక్కడ చలిగాలుల తీవ్రత కొనసాగుతుందని అంటున్నారు. మరో మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతవరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

ఏపీలో ఇక్కడ...
ఇక ఆంధ్రప్రదేశ్ లోనూ చలితీవ్రత గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కువగా ఉంది. గతంలో ఇరవై డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు ఉండేవి. సాధారణంగా పదిహేను డిగ్రీలు నమోదయ్యేవి. అలాంటిది ఇప్పుడు పది డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే చలితీవత్ర ఆంధ్రప్రదేశ్ ఏ స్థాయిలో ఉందో చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో చలిగాలుల తీవ్రతకు గిరిజనులు అల్లాడి పోతున్నారు. రాత్రి వేళ ఉష్ణోగ్రతలు మరింత కనిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. ఉదయం పది గంటలు దాటితే కానీ ఇళ్ల నుంచి బయటకు రావడానికి వీలు కావడం లేదు. మినుములూరు,అరకు, పాడేరు ప్రాంతాల్లో కనిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
తెలంగాణలో ఈ ప్రాంతంలో...
తెలంగాణలో కూడా చలిగాలుల తీవత్ర మరీ ఎక్కువగా ఉంది. ఉదయం వేళ పొగమంచు కూడా అధికంగానే ఉంది. మరి కొన్ని రోజుల పాటు చలితీవ్రత తప్పదని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చలిగాలుల తీవ్రతను తట్టుకోలేక జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. వాహనాల్లో వెళ్లేవారు జాగ్రత్తగా వెళ్లాలని సూచిస్తున్నారు. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, పటాన్ చెర్వు, మెదక్, హైదరాబాద్, హనుమకొండ, రామగుండం,దుండిగల్, హయత్ నగర్, నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ, భద్రాచలం, మహబూబ్ నగర్ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ జిల్లాల్లో ప్రజలు చలికి ఇబ్బందులు పడుతున్నారు.


Tags:    

Similar News