Road Accident : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు స్పాట్ డెడ్
పంచాయతీ ఎన్నికలలో ఓటు వేయడానికి వెళుతూ జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు
పంచాయతీ ఎన్నికలలో ఓటు వేయడానికి వెళుతూ జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. ఈ ఘటన పెద్దశంకర్ పేట్ లో జరిగింది. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట జాతీయ రహదారిపై రాత్రి జరిగిన ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. పోలీసుల కథనం ప్రకారం... పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.
ఓబు వేయడానికి వెళుతుండగా...
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాగి గ్రామానికి చెందిన కురుమ లింగమయ్య తన కుటుంబంతో కలసి ఓటు వేయడానికి బయలుదేరారు. ఈ ప్రమాదంలో కురుమ సాయవ్వ, కురుమ సాయిలు, మానస మరణించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతదేహాలను జోగిపేట ఆసుపత్రికి పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.