నల్లవల్లి గ్రామానికి వెయ్యేళ్ల చరిత్ర ,చారిత్రక ఆనవాళ్లను కాపాడుకోవాలి
పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి
హైదరాబాద్, డిసెంబర్,14: మెదక్ జిల్లా, జన్నారం మండలం, నాగవల్లికి వెయ్యేళ్ల చరిత్ర ఉందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. గ్రామానికి చెందిన రాయారావు వి.రామారావు ఇచ్చిన సమాచారం మేరకు ఆదివారం నాడు గ్రామ పరిసరాల్లో జరిపిన అన్వేషణలో బీరన్న గుడి వద్ద రాష్ట్ర కూటుల కాలపు (సా.శ. 10వ శతాబ్ది) నాటి నాలుగడుగుల ఎత్తు, మూడు అడుగుల వెడల్పు గల రాతిపై నిలబడి, నాలుగు చేతుల్లో డమరుకం, శూలం, ఖడ్గం, కపాల పాత్ర, తలపై విరి జడలను, వంటిపై కపాలమాలను ధరించిన భైరవ శిల్పం చారిత్రక ప్రాధాన్యత గలదని ఆయన అన్నారు. గ్రామం గ్రామంలోని 18వ శతాబ్దిలో రాయారావు దేశ్ ముకులు నిర్మించిన కోట (గడి), సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం, దాని ముందు కోనేరు (దిగుడుబావి) శిధిలావస్థలో ఉన్నాయని, చారిత్రక ప్రాధాన్యత గల ఈ వారసత్వ కట్టడాలను కాపాడుకోవాలి నల్లవల్లి గ్రామస్తులకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.