Telangana : రేపు తెలంగాణలో చివరి విడత పంచాయతీ ఎన్నికలు
రేపు తెలంగాణలో చివరి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి
రేపు తెలంగాణలో చివరి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రేపటి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సిబ్బందికి అవసరమైన సామగ్రిని అందచేశారు. నేడు తమకు కేటాయించిన గ్రామాలకు పోలింగ్ సిబ్బంది చేరుకోనున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పోలింగ్ జరుగుతుందని అధికారులు తెలిపారు.
భారీ బందోబస్తు మధ్య...
మధ్యాహ్నం రెండు గంటలకు సర్పంచ్, వార్డు సర్పంచ్ పదవులకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అనంతరం వైస్ సర్పంచ్ ఎన్నికలు కూడా జరపనున్నారు. రేపు చివర విడతగా తెలంగాణలోని 3,752 సర్పంచ్, 28,406 వార్డు పదవులకు పోలింగ్ జరగనుంది. మూడో విడతలోనూ ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.